నవతెలంగాణ–హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం ఈ రోజు బెంగళూరుకు వెళ్లనుంది. కృష్ణా బేసిన్‌లో నెలకొన్న నీటి కొరత నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. కర్ణాటక నుంచి అదనపు నీటి విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెల్లడించారు. అంతకుముందు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటి అందుబాటుపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం జూరాల ఆయకట్టులో సాగునీటి కోసం రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
జూరాల కోసం బెంగళూరుకు తెలంగాణ మంత్రులు
- Advertisement -
- Advertisement -


