నవతెలంగాణ-ఆత్మకూర్
జూరాల ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్ట క్వార్టర్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు జిఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాజు, ఆర్ ఎం రమేష్, రాఘవేంద్ర కురుమూర్తి, తదితరులు మాట్లాడుతూ.. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే పంట సాగుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసుకున్న రైతులు వారి ముందే పంట ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెబుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి కూడా స్పందించడం లేదని ఆరోపించారు. అక్రమ అరెస్టులను వారు ఖండించారు. సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనీ, లేనియెడల ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



