Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంకావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు..

కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కర్ణాటకకు 70 టీఎంసీల నీరు అదనంగా కేటాయించాలని కోరుతూ ఒక ప్రయివేటు సంస్థ వేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రయివేటు సొసైటీల పిటిషన్లు చెల్లవని స్పష్టం చేసింది.

అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్ పార్టీలు లేక సొసైటీలు జోక్యం చేసుకోలేవని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇలాంటి పిటిషన్లను విచారిస్తూ పోతే.. వివాదాలు ఇంకెప్పటికి ముగుస్తాయని ప్రశ్నించింది. ఇప్పటికే కావేరీ జలాలపై తమిళనాడు , కర్ణాటక చట్టపరంగా పోరాడుతున్నాయని పేర్కొంది. ఈ వివాదంలో ప్రయివేటు సొసైటీలకు స్థానం లేదని.. రాష్ట్రాలకే మాట్లాడే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -