Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చర్‌ కావడంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో మదనపల్లె-తిరుపతి హైవేపై మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. మదనపల్లె డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ బస్సు తిరుపతికి వెళ్తుండగా టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -