గత రెండేళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల టెలివిజన్ నిర్మాతలతో ఎన్నోసార్లు చర్చించి, చివరగా జనవరి 2026లో చెన్నైలో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి మీటింగ్ నిర్వహించుకుని ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కావలసిన అన్ని ప్రక్రియలు రిజిస్ట్రేషన్, బైలాస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’సంస్థ అధికారికంగా ఏర్పరిచారు. ఈ సందర్భంగా టాప్కోస్ అధ్యక్షుడు ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ,’ఈ సంవత్సరం సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి పరిశ్రమ గుర్తించుకోదగిన చారిత్రాత్మకమైన దినంగా మేం పరిగణిస్తున్నాం. ఎందుకంటే నాలుగు రాష్ట్రాల నిర్మాతల మండళ్లు కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడటం ఇదే మొట్ట మొదటిసారి. టాప్కోస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి మూలం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గత 15యేళ్లుగా దానికి సాధించిన విజయాలు. ఒక నిర్మాణాత్మకమైన, గొప్ప ఐక్యత కలిగిన ఒక కౌన్సిల్ గా డెవలప్ కావడం.. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ ఫెటర్నిటీకి ఎనలేని సేవలు అందించే స్థాయికి చేరుకుంది. తెలుగు టివి పరిశ్రమకు, నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అందరికీ పెద్ద దిక్కుగా తెలుగు కౌన్సిల్ నిలబడింది. ఈ ప్రాసెస్ లో ఓ మూడేళ్ల నుంచి ఇంటర్ స్టేట్ ప్రొడక్షన్స్ బాగా పెరిగాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్జేంజ్ పెరిగింది. కన్నడ నుంచి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ రావడం.. ఇక్కడి ప్రొడ్యూసర్స్ కన్నడకి, తమిళ్ కు రావడం.. తమిళనాడు నుంచి ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు రావడం, అలాగే మళయాల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రావడం.. తెలుగు వాళ్లు కేరళకు వెళ్లి అక్కడ సీరియల్స్ చేయడం జరుగుతోంది. ఇలా ఇంటర్ స్టేట్ యాక్టివిటీస్ పెరగడంతో.. ఈ నాలుగు రాష్ట్రాల నిర్మాతల మధ్య ఒక సమన్వయం ఉండాలనే లక్ష్యంతో ‘టాప్కోస్ని ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు.
టెలివిజన్, ఓటీటీ రంగంలో కీలక అడుగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



