- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ హత్యకు దారి తీసింది. మహారాష్ట్రకు చెందిన సియా(33)ను ఆమె ప్రేమికుడు సమీర్, తన కుటుంబ సభ్యులతో కలిసి గొంతు కోసి చంపాడు. అయితే సమీర్ కు గతంలోనే వివాహం జరగగా.. సియాతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. దీంతో సోమవారం ఆమెను హతమార్చి, మృతదేహాన్ని ఇనుప పెట్టెలో పెట్టి సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. పోలీసులు 24 గంటల్లోనే నిందితులను గుర్తించి కేసును ఛేదించారు.
- Advertisement -



