ప్రతికూల వాతావరణ కారణంగా ఢిల్లీ నుంచి బెంగళూరుకు డైవర్ట్]
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేశారు. రేవంత్రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు దిల్లీ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరారు. హైదరాబాద్లో వర్షం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. రాత్రికి బెంగళూర్లోనే సీఎం బస చేయనున్నారు. సీఎం వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత బెంగళూరు నుంచి సీఎం హైదరాబాద్ రానున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, జీడిమెట్ల, సనత్నగర్, అమీర్పేట, బోరబండ, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్బాగ్, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి.
సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



