- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు. టాటా సంస్థతో సంయుక్తంగా 119 ఏటీసీలను ఏర్పాటు చేశామన్నారు. విద్యాతోపాటు సాంకేతిక నైపుణ్యం నేర్పిస్తామని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాకు పంపిస్తామన్నారు. ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగం, నజరానాలు ఇస్తామని తెలిపారు.
- Advertisement -



