- Advertisement -
ఓటింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ-బాల్కొండ
మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థిని, విద్యార్థులకు మాక్ ఎలక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటింగ్ ప్రక్రియ గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులను ఉపాధ్యయ బృందం అభినందించారు.అనంతరం విద్యార్థుల పురోగతిపై పేరెంట్,ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల పురోగతి కార్డులను తల్లి దండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్ పాల్గొనారు.
- Advertisement -



