Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజేఈఈ మెయిన్‌ (సెషన్‌-1)లో నారాయణ ట్రెమెండస్‌ రికార్డ్‌

జేఈఈ మెయిన్‌ (సెషన్‌-1)లో నారాయణ ట్రెమెండస్‌ రికార్డ్‌

- Advertisement -

ఐదు రాష్ట్రాల్లో స్టేట్‌ టాపర్స్‌గా నిలిచిన ఏకైక విద్యాసంస్థ
ముగ్గురు విద్యార్థులకు 100 పర్సంటైల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ గ్రూప్‌ డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వివరాలు వెల్లడించారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో తమ విద్యార్థులు స్టేట్‌ టాపర్స్‌గా నిలిచినట్టు తెలిపారు. వివన్‌ శరత్‌ మహేశ్వరి (అప్లికేషన్‌ నెంబర్‌ 260310 757063), మాధవ్‌ విరాడియా (అప్లికేషన్‌ నెంబర్‌ 260310 434636), నరేంద్రబాబు (అప్లికేషన్‌ నెంబర్‌ 260310 088709) 100 పర్సంటైల్‌ సాధించి దేశంలోనే టాపర్లుగా నిలిచారని వారు హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన విష్ణు సాయి తేజ 99.999 పర్సంటైల్‌తో, గోవాకు చెందిన తనరు అజిత్‌ ప్రభు 99.825 పర్సంటైల్‌తో ఆయా రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచారని చెప్పారు.

డాక్టర్‌ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ అనితరమైన శిక్షణ, రీసెర్చ్‌ ఒరియంటెడ్‌ ప్రోగ్రామ్‌లు, పటిష్ట ప్రణాళిక, స్టడీ మెటీరియల్‌, నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షలతోనే ఈ ఘనత సాధించగలిగినట్టు తెలిపారు. నారాయణ అనుసరిస్తున్న పటిష్టమైన విద్యా విధానం, కాన్సెప్ట్‌ డెఫినేషన్‌ ఫార్ములా, టెక్నాలజీ ఆధారిత శిక్షణ విద్యార్థులను విజేతలుగా నిలుపుతున్నాయన్నారు. దిశ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ, ఒత్తిడి లేని చదువును అందిస్తూ, ప్రతి విద్యార్థి లోపాలను విశ్లేషిస్తూ, వారికి వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
పి.శరణి మాట్లాడుతూ నారాయణ ఇన్‌-హౌస్‌ లెర్నింగ్‌ యాప్‌ ఎన్‌-లెర్న్‌ ద్వారా విద్యార్థులు తమ ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. నారాయణ విద్యార్థుల కలలే తమ కలలనీ, వారి లక్ష్య సాధనలో తాము నిరంతరం తోడుంటామని చెప్పారు. టెక్నాలజీ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల కలయికే నారాయణ విజయ రహస్యమని చెప్పారు.

ఈ అద్భుత విజయంపై నారాయణ విద్యాసంస్థల కోర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ మెంబర్‌ పి.రమాదేవి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషినీ, తల్లిదండ్రుల సహకారాన్ని, నారాయణ అధ్యాపక బృందం అంకితభావాన్ని ఆమె కొనియాడారు. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ కోసం కేవలం నారాయణ విద్యాసంస్థలకు చెందిన అత్యధిక శాతం విద్యార్థులు జేఈఈ మెయిన్‌ నుంచి క్వాలిఫై కావటం గర్వంగా ఉందని తెలిపారు. అందుకే ఐఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌ నారాయణే అని మరోసారి నిరుపించామనీ, ఈ విజయం జేఈఈ మెయిన్‌ సెషన్‌-2, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో మరిన్ని రికార్డులు సష్టించేందుకు ప్రేరణనిస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -