Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం : సుష్మ

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం : సుష్మ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 300కు 300 మార్కులతో 100 పర్సంటైల్‌ సాధించిన పస మోహిత్‌ శ్రీచైతన్య విద్యార్థి అని తెలిపారు. అదే విధంగా 290, 285, 280 మార్కులతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ పర్సంటైల్స్‌ సాధించారని వెల్లడించారు. విద్యార్థుల కఠోర పరిశ్రమ, సంస్థ రూపొందించిన ర్యాంకింగ్‌ వ్యవస్థ కారణంగానే నాలుగేండ్లుగా జేఈఈ మెయిన్‌ లో 100 పర్సంటైల్స్‌ సాధిస్తున్నారని చెప్పారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులను ఆమె అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -