Wednesday, June 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ ఆట‌గాళ్లు జెర్సీపై ‘మినాబ్ 168’

ఇరాన్ ఆట‌గాళ్లు జెర్సీపై ‘మినాబ్ 168’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియా యుద్ధం కార‌ణంగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇరాన్‌లోని మినాబ్ స్కూల్ పై అమెరికా వైమానిక దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపుగా 168మందిపైగా స్కూల్ విద్యార్థులు చ‌నిపోయారు. తాజాగా ఫిఫా వ‌ర‌ల్డ్ పుట్‌బాల్ టోర్నీలో భాగంగా నేడు ఇరాన్, అమెరికా జ‌ట్లు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈక్ర‌మంలో ఆ దేశ ఆట‌గాళ్లు ధ‌రించే డ్రెస్‌ల‌పై “మినాబ్ 168’ పేరుతో మృతుల‌కు నివాళిగా తమ యూనిఫామ్‌లపై బంగారు పిన్‌లను ప్ర‌ద‌ర్శించారు. ఈమేర‌కు ఇరాన్ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఎక్స్ వేదిక‌గా పోస్టు విడుద‌ల చేశారు.

“అనేక గాయాలు ఉన్నప్పటికీ ఇరాన్ సగర్వంగా నిలిచి ఉంది; విశాలమైన గుండెలు, అచంచలమైన సంకల్పం కలిగిన ఆ దేశ బిడ్డలు ప్రపంచ వేదికపై పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. జాతీయ జట్టు ప్రయాణంలో దేశ ప్రజల ప్రార్థనలు వారికి తోడుగా ఉంటాయి, వారి కోసం, ఇరాన్ కోసం ఆ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడం కోసం, మనం ఏకకంఠంతో ‘ఇరాన్’ అనే పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ, మన యువతకు విజయం గౌరవం లభించాలని ఆకాంక్షిద్దాం’ అని రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -