- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం జరిగింది.ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌కు సమీపంలో ఓ రెస్టారెంట్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..సంఘటన స్థలానికి హుటహుటిన చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ లో పలు కీలక సామాగ్రి దగ్ధమైంది.రెస్టారెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నిచర్ మరియు పాత్రలకు నిప్పంటుకుంది. ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
- Advertisement -



