Wednesday, February 18, 2026
E-PAPER
HomeఆటలుT20 World Cup: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘప విజయం

T20 World Cup: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘప విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (36), ర్యాన్‌ రికెల్టన్‌ (30), ఐదెన్‌ మార్‌క్రమ్‌ (28) రాణించారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ, జవాదుల్లా, అర్ఫాన్‌, ఫారుఖ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యం నిలిచింది.యూఏఈ బ్యాటర్లలో అలీషన్‌ షరాఫు (45; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (22; 12 బంతుల్లో 4 ఫోర్లు) వేగంగా ఆడాడు. ఆర్యన్ష్‌ శర్మ (13), ముహమ్మద్‌ అర్ఫాన్‌ (11) మినహా మిగిలిన వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్‌ నోర్ట్జే రెండు వికెట్లు తీశాడు.జార్జ్‌ లిండే ఓ వికెట్‌ సాధించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -