Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే..`

‘మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే..`

- Advertisement -

హీరో సూర్య నటిస్తున్న నయా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘నేనో బటర్‌ఫ్లై’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. జి.వి. ప్రకాష్ ఈ గీతాన్ని స్వరపరిచారు. ‘రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను.. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే” అంటూ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని సుబ్లాషిని తన మధురమైన గాత్రంతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. కుటుంబ భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే అంశాలతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది అని చిత్ర బృందం తెలిపింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -