Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిచ్చి మొక్కలను తొలగించిన సర్పంచ్

పిచ్చి మొక్కలను తొలగించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామానికి గల రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలను జేసీబీ సాయంతో ఆ గ్రామ సర్పంచి దిగంబర్ దగ్గరుండి తొలగింపజేశారు. దీంతో ఇరువైపులా సుందరంగా కనిపిస్తోంది. పిచ్చిమొక్కల వలన ఇన్నాళ్ళుగా గ్రామంలోని వాహన దారులు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం సర్పంచ్ పనితీరు పట్ల ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచిగా ఎన్నికైన తర్వాత గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్న సర్పంచ్, ఉపసర్పంచ్ లను గ్రామ పెద్దలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ షాదుల్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -