Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుస్తక పఠనంతో విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దబడతారు 

పుస్తక పఠనంతో విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దబడతారు 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను 
పుస్తక పఠనంతో, విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దబడతారని, ఇందిరా ప్రియదర్శిని అవార్డు గ్రహీత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం  ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు సమావేశం ప్రిన్సిపాల్ కంఠం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, తిరునగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

మొబైల్ ఫోన్ కంటే శక్తివంతమైనది హ్యూమన్ బ్రెయిన్ అని, నిద్ర పోయినా పని చేస్తుందని చెప్పారు. ఆలేరు పట్టణనికి ప్రత్యేకతలు ఉన్నాయని,  సాహిత్యం, కవులు, కళాకారులు వెలుగొందినా ప్రాంతం అన్నారు.  ప్రత్యేక రాష్ట్రం సాధనలో పోరాటం చేసిన చరిత్ర  ఈ గడ్డదని అన్నారు. సెల్లు వినియోగం తగ్గించాలని, కండ్లు పాడే ప్రమాదం ఉందని, పుస్తక పఠనంతో విద్యపై పట్టు సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు.

రానున్న పరీక్షలలో విద్యార్థులు పోటీపడి కార్పోరేట్ కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం పెంపొందించాలన్నారు. కళాశాలకు, తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. కళాశాల యజమాన్యం ఆహ్వానితులని,శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపకాల అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కంఠం రమేష్, అనిల్ అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -