- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు జ్యోతిష్యరెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 80 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి తల్లిదండ్రులకు,అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని,అలాగే ఉన్నత శిఖరాలకు అవరోధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేందర్,మహిళ విభాగం అధ్యక్షురాలు మంజుల రెడ్డి,సభ్యులు అశోక్,ప్రసాద్,కుమార్,రాజాబాపు,అశోక్,నాగరాజు,కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



