నవతెలంగాణ – హైదారాబాద్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనలను తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తాము శక్తిమేర అన్ని విధాలా కృషి చేశామని, కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల రాజధాని ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ నిర్వహణ తీరుపై వి.హనుమంత రావు అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది: కాంగ్రెస్ నేత వీహెచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



