Monday, February 23, 2026
E-PAPER
Homeదర్వాజపోర్ట్ఫోలియో

పోర్ట్ఫోలియో

- Advertisement -

అచ్చంగా అది వాయుపుత్రుని రూపమే!
గమ్మత్తులు జిమ్మిక్కులు
పైకి పాకడాలు, కిందికి జారాడాలు
గుట్టెక్కడానికి చక్రాల బూట్లు తొడుక్కున్నట్టు
ఒకానొక సమదష్టిని వెన్నుపూసన మోయాలి!
ఎరుపు, ఆకుపచ్చని కాంతులు వెదజల్లే
పచ్చపువ్వుల వనాలు పొజిషన్‌ ఏదైనా…
వెండితీగలకు వేళాడే కాండిల్‌ వెలుగులే
స్టీరింగ్‌ చేతబూనిన దేవకాంతలు
ఆ కదలికల హెచ్చుతగ్గులు
నుదుటిరాతను మార్చే మాంత్రిక శక్తులు
ఎవరున్నారని మౌనంగా గమనించు
ఒక్కోమెట్టుకూ ఒక్కో కలగలిసిన శబ్దం
దిగబడి కొందరు ఎగబడి కొందరు
ఎగబాకి మరికొందరు, కుదేలై ఇంకొందరు
స్తబ్దులై… నిచ్చేష్టులై.. ఆశాగీతాలై ఆత్రుతలై.. మునులై
అంతా ఒక్కసారిగా అరుస్తున్న దశ్యం
స్టేడియంలో బంతిబంతికీ ఉండే కుతూహలంలాగే
ఆనందావేశాల కలబోతల ఆదుర్దా స్వప్నం!
ఏం జరుగుతుందో…
ఎవరు ఎవరిని దోచుకుంటున్నారో…
ఎవరు ఎలా లాభపడుతున్నారో…
ఏ పరీక్షలెలా ఎదురౌతాయో…
ఊహకందని వ్యూహరచనలో
ఆ గదినిండా భవిష్యనిధులే!
అరుణ నారదభట్ల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -