నవతెలంగాణ-హైదరాబాద్: పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌లోని చారిత్రిక ప్రదేశాలను బుధవారం పరిశీలించారు. సెవెన్ టూంబ్స్, కటోరా హౌస్, కేబీ మ్యూజియం, చార్మినార, చౌమళ్ళ పాలస్‌ను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్(karavan)మరివు జూలీఫికర్ అలీ (చార్మినార్)తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
కుతుబ్ షాహీ టూంబ్స్ లోని ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్ గురించి చర్చించారు. కేసు పూర్వాపరాలను గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కుతుబ్ షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయని ఆరా తీశారు. క్లియరెన్స్ స్టేజిలో ఉన్నాయని, ఆయా శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్ సిద్ధం చేస్తామని HUMTA అధికారులు చెప్పారు.
అనంతరం కటోరా హౌస్‌ను సందర్శించారు.
పురావస్తు శాఖ, GHMC, HMDA, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ ఆటోఆరిటీని సమన్వయం చేసుకుని , డీపీఆర్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కటోరా హౌస్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కటోరా హోసే పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థాలను వెనువెంటనే తొలగించాలని అధికారులు ఆదేశించారు.
తర్వాత గోల్కొండ కోట సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ QQSUDA, TGTDC అధికారులను అదేచించారు. అక్కడి నుంచి ఖజానా బిల్డింగ్ మ్యూజియంకు చేరుకున్నారు. ఎంతో చారిత్రాత్మక విలువైన కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంను పర్యాటకంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
చారిత్రక కట్టడం చార్మినార్ చేరుకున్నారు. వాటర్ పౌటన్‌కు, చార్మినార్ కి లైమేమోటార్ తో పురావాస్తు పద్దతిలో మరమత్తులును చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చివరగా చౌమల్లా పాలస్ తనిఖీ చేసి చేశారు. ఆ సమయంలో విదేశీ యాత్రికులతో సంభాషించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట టీజీటీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ prof అర్జున రావు కుతాడి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి.నాగరాజు, డాక్టర్ డి రాములు నాయక్, ఎన్ నర్సింగ్, ఏ. రాజు ఓఎస్డి ఇతర శాలల అధికారులు పాల్గొన్నారు.



