Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంఖర్గే ఛాంబర్‌లో ఇండియా బ్లాక్‌ ఎంపీలు కీల‌క భేటీ

ఖర్గే ఛాంబర్‌లో ఇండియా బ్లాక్‌ ఎంపీలు కీల‌క భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకు, ఇండియా బ్లాక్‌ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. నేడు సభలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే రాజ్యాంగ (నూట ముప్పై ఒకటవ సవరణ) బిల్లు, 2026పై చర్చ జరగనుంది. అలాగే ఢిలీ మరియు జమ్మూ కాశ్మీర్‌కు విస్తరించే కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026, డీలిమిటేషన్‌ బిల్లులపైనా లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్‌ ఎంపీలు నేడు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకునేందుకు ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -