నవతెలంగాణ-హైదరాబాద్: నేడు సభలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ (131 సవరణ) బిల్లు, 2026పై చర్చ జరగనుంది. అలాగే ఢిలీ మరియు జమ్మూ కాశ్మీర్‌కు విస్తరించే కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026, డీలిమిటేషన్ బిల్లులపైనా లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈక్రమంలోనే ఆ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించడానికి ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను పొడిగించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను సదురు బిల్లును ఆమోదించనియమని భీష్మించాయి.
ఎంపీ కనిమొళి(MP Kanimozhi ) మాట్లాడా డీలిమిటేషన్ బిల్లు సరైన దశలోనే ఉండి ఉంటే, అప్పుడు ఆ బిల్లును ఎందుకు తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని డీఎంకే ఎంపి కనిమొళి ప్రశ్నించారు.డీలిమిటేషన్ అంశంపై ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితోనూ కేంద్రం సంప్రదించలేదని ఆమె ఆరోపించారు. 2021లో జనాభా లెక్కలను ప్రభుత్వం వాయిదా వేసిందని, ఇప్పుడు వాటి స్థానంలో పాత జనాభా లెక్కలను తీసుకుంటున్నారని, అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆమె ఆరోపించారు.ఎన్నికల రెస్క్యూ వ్యూహాం తరహాలో మహిళలను బీజేపీ వాడుకుంటున్నదని డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు.
మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టడం “భారత మహిళల ఆకాంక్షలను బందీగా ఉంచడమే” అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన “సమాఖ్యవాద స్వరూపాన్ని ఛిన్నాభిన్నం చేయగలదని” హెచ్చరిస్తూ, దీనిపై కూలంకషంగా చర్చించాలని, తొందరపడకూడదని ఆయన కోరారు.
మహిళ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, కానీ ఆ బిల్లుతో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో ముడిపెట్టడం భారతీయ మహిళల ఆకాంక్షలను బందీగా ఉంచడమే” అని థరూర్ అన్నారు.



