Sunday, April 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభార్యను చంపిన యూఎస్ మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్

భార్యను చంపిన యూఎస్ మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (47) తన భార్య డాక్టర్ సెరీనా ఫెయిర్‌ఫాక్స్ (49)ను కాల్చి చంపి, ఆపై తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వాషింగ్టన్ డిసి శివారు ప్రాంతమైన అన్నందలేలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ తన భార్యను ఇంటి బేస్‌మెంట్‌లో కాల్చి చంపి, ఆ తర్వాత పై అంతస్తులోని గదిలోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరిద్దరి మృతదేహాలను చూసిన వారి కుమారుడు భయాందోళనతో 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -