- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమెన్స్ T20 వరల్డ్ కప్‌లో భాగంగా, ఇవాళ టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. సెమీఫైనల్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. గ్రూప్-Aలో భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఆడిన 3 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు సెమీస్‌లో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి, ఆపై గ్రూప్ టాపర్ ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.
- Advertisement -



