Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర ప్రమాదం..నలుగురు మృతి

ఘోర ప్రమాదం..నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి వద్ద పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది విజిల్ ఊదటంతో కలప లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయగా, వెనుక నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న యనమల మాధవి (37), ఆమె కుమార్తె మేఘన (15) అక్కడికక్కడే మృతిచెందగా, రాజశేఖర్ (25), బేబీ (50) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగురిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -