Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలులాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ట్రంప్‌ టారిఫ్‌ల రద్దు వంటి పరిణామాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో సూచీలు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ 25,700 మార్క్‌ పైన కదలాడుతోంది.
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 643.74 పాయింట్ల లాభంతో 83,458.45 వద్ద, నిఫ్టీ 193.85 పాయింట్లు పెరిగి 25,765.10 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పెరిగి 90.75 వద్ద కొనసాగుతోంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -