Monday, February 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ రిసార్టులో కాల్పుల కలకలం..ఒకరు మృతి

ట్రంప్ రిసార్టులో కాల్పుల కలకలం..ఒకరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ రిసార్ట్ వద్ద ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. రిసార్టులోకి గన్ పట్టుకుని అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లో ఉన్న ట్రంప్ నివాసం కమ్ రిసార్ట్ వద్దకు ఒక వ్యక్తి గన్‌తో వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ కాపలా ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నప్పటికీ, అతను మొండిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే, సాధారణంగా డొనాల్డ్ ట్రంప్ వారాంతాల్లో ఈ పామ్‌బీచ్ రిసార్ట్‌లోనే గడుపుతుంటారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరని, ఆయన వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లోనే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు.. అతడు రిసార్టుపై దాడికి ఎందుకు ప్లాన్ చేశాడు? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -