Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య విరాళాల స్కామ్..ఆ ఇద్దరి రాజీనామా ఆమోదం

అయోధ్య విరాళాల స్కామ్..ఆ ఇద్దరి రాజీనామా ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య బాలరాముడి ఆలయ విరాళాలకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా లేఖలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం ధృవీకరించింది. కాగా, విరాళాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఘటనల పట్ల తాము దిగ్భ్రాంతికి, తీవ్ర మనస్తాపానికి గురయ్యామని ఆలయ నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. శ్రీరామ భక్తులందరి ప్రతినిధులు, ఇక్కడ సేవలందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల తరపున నిష్పాక్షికమైన విచారణను నిర్ధారించడానికి భక్తులకు భరోసా కల్పించడానికి ఈ ట్రస్ట్‌ కట్టుబడి ఉంది అని ఈ ప్రకటన పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -