నవతెలంగాణ-మద్నూర్
గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 125 మంది లబ్దిదారులకు గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్టాభివృద్ధికై అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా గూడు లేని నిరుపేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాణి, మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, టౌన్ అధ్యక్షులు బండి గోపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మండలంలోని సర్పంచులు గ్రామ కార్యదర్శులు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు పాల్గొన్నారు.



