Sunday, June 28, 2026
E-PAPER
Homeజాతీయంభారత్ పర్యటనకు ట్రంప్

భారత్ పర్యటనకు ట్రంప్

- Advertisement -


ట్రేడ్ డీల్ కుదురుతుందా..?
వ్యాపార వర్గాల ఆసక్తి
న్యూఢిల్లీ: అ
మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. తాము అదే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. వైట్ హౌస్‌లో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రూబియో, ఈ ఏడాది ముగిసేలోపు తాను భారత్‌కు వచ్చి అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్లపై చర్చలు జరుపుతానని తెలిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కానున్నది.
ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం గణనీయంగా పెరగడంతో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలపడిందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య వ్యక్తిగత అనుబంధం కూడా చాలా బలంగా ఉందని తెలిపారు. దౌత్య సంబంధాల్లో ఈ అంశం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తెగని ట్రేడ్ డీల్ కుదురుతుందా..? అని వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -