- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో మహాదేవుని ఆలయం నిర్మించి 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆలయంలో వారం రోజులుగా అఖండ శివనామ సప్త నిర్వహించి బుధవారం ముగింపు పలికారు. ప్రతిరోజు కీర్తనాలు భజనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు రోజున ఆలయంలో అహ్మద్పూర్ మహారాజ్ జన్మదిన వేడుకలు ఉయ్యాల పాటలతో మహిళలంతా ఘనంగా జరిపారు. సప్త ముగింపు రోజున వారం రోజులుగా నిర్వహించిన భజన కీర్తన ప్రముఖులందరికీ ఘనంగా సన్మానించారు. అనంతరం బుధవారం ఆలయ ఆవరణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. డోంగ్లి మండల కేంద్రంలో పండుగ వాతావరణం కనిపించింది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సప్త కార్యక్రమం విజయవంతమైంది.
- Advertisement -



