Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు.!

లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు.!

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని లింబూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం కోసం రూ.20 లక్షలు వెచ్చించారు. ఆ ఉపకేంద్రం నిర్మాణం ఏండ్ల తరబడి పూర్తి చేయకుండా నిరుపయోగంగా వదిలేశారు. గత బి ఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆయంలో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి రూ.20 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులతో ఉపకేంద్రం నిర్మాణం చేపట్టారు దానిని పూర్తి చేయకుండా వదిలివేశారు. పనులు పూర్తి కాలేక ఏళ్ల తరబడి నిరూపియోగంగా వదిలివేయడం ఆరోగ్య ఉప కేంద్రం ప్రజలకు ఎలాంటి సౌకర్యాలకు ఉపయోగం లేకుండా పోతుంది. ఈ ఉపకేంద్రం నిరుపయోగంగానే వదిలిపెట్టడం ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించి ఆరోగ్య ఉప కేంద్రం నిలిచిపోయిన పనుల గురించి గానీ ప్రజలకు అవసరాల కోసం ఆ బిల్డింగు వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -