Thursday, February 26, 2026
E-PAPER
Homeసినిమాస్నేహ బంధం నేపథ్యంలో 'ఈ జిందగీ..'

స్నేహ బంధం నేపథ్యంలో ‘ఈ జిందగీ..’

- Advertisement -

శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్‌ షా కిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్ఫెక్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లపై సందీప్‌ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజ వరగమన’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. హీరో రామ్‌ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్‌ సింగిల్‌ ‘ఈ జిందగీ’ని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేయించారు.

ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసిన రామ్‌.. టీంకి బెస్ట్‌ విషెస్‌ను అందించారు. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కాల భైరవ అందించిన బాణీ, అభినవ కవి ర్యాప్‌ వెర్షన్‌ అద్భుతంగా ఉంది. ఇక అభినవ కవి, కృష్ణకాంత్‌ రాసిన సాహిత్యం అయితే జీవితం, అందులో ఎదురయ్యే సవాళ్ల గురించి ఎంతో గొప్పగా చాటి చెబుతోంది. శ్రీ విష్ణు తన గ్యాంగ్‌తో కలిసి చేసే పనులు, వాళ్లకి ఎదురైన సవాళ్లు, వారి స్నేహ బంధం ఇలా అన్నీ రకాల ఎమోషన్స్‌ను చూపించేలా ఈ పాట సాగింది. ఆదిత్య అయ్యంగార్‌ గాత్రం ఈ పాటకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -