నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ చెట్టు కూలి స్కూల్ బస్సు మీద పడింది. ప్రమాద ధాటికి ఓ విద్యార్ధి మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. చెంబూర్‌లోని రోడ్ నెం. 11పై హెరిటేజ్ ప్రైడ్ సమీపంలోఈ ఘటన జరిగింది. మేక్ ఫోర్స్ కంపెనీకి చెందిన పాఠశాల బస్సులో, హైస్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తుండగా, రోడ్డు పక్కన ఉన్న ఒక పింపుల్ చెట్టు కూలి బస్సుపై పడినట్లు సమాచారం.ఈ ప్రమాద సమయంలో బస్సులో 12 మంది పిల్లలను ఉన్నారు. బస్సు కండక్టర్, స్థానికుల సాయంతో వారిని సురక్షితంగా రక్షించారు. నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఐదుగురు విద్యార్థులను చికిత్స కోసం వెంటనే జెన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు.




