మూడు సంవత్సరాలు కావస్తున్న పాలమూరు ప్రాజెక్టుల్లో మూడు అడుగుల మట్టి కూడా తీయలేదు
డార్క్ ఏరియాగా ఉన్న మిడ్జిల్ మండలాన్ని కృష్ణ నాది నీళ్లతో పంటలు పండించింది బీఆర్ఎస్ పార్టీ
మాజీ మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-మిడ్జిల్
తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని నాయకుడు నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని ఘాటు విమర్శలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ రాధిక భర్త బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వెంకరెడ్డి విగ్రహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి రాజీనామా చేసిన నాయకుడు చర్లకోల లక్ష్మారెడ్డి అన్న అని చెప్పారు.
కృష్ణానది నీళ్లు మిడ్జిల్ మండలానికి తీసుకురావడానికి రాత్రింబవులు కష్టపడి దుందిబి నదిపై అక్విడెంట్ పూర్తి చేసి కృష్ణ నీళ్లతో పచ్చని పంటలు రైతులు పండిస్తున్నారు అంటే దానిక్కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ప్రభుత్వము పట్టించుకోవడంలేదని, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు జపం చేస్తూ, కృష్ణ ,తుంగభద్ర నీళ్లు కర్ణాటక తీసుకెళ్తూ పాలమూరుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తల అభిమానం చూస్తే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందుకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసి హైమావతి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం నుండి మన్యం బాల్ రెడ్డి కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, రజిని, మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపి బర్గెల సుదర్శన్, మాజీ జెడ్పిటిసి సభ్యులు శశిరేఖ బాలు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు జైపాల్ రెడ్డి, జంగారెడ్డి, నారాయణరెడ్డి, చంద్రయ్య గౌడ్, వెంకటయ్య, మహమ్మద్ రఫీ, నామిని శ్రీనివాసులు, గంజి కృష్ణ, మథిన్, సుకుమారు, గంజి శేఖర్, మంద భీమ్ రాజ్, బంగారు, ప్రేమ్ కుమార్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.



