- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని కె.వి.ఆర్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కామిని గౌతమి (37) యాసిడ్ తాగి మరణించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ మంగళవారం తెలిపారు. గత కొంత కాలంగా మానసిక ఒత్తిడి వలన అనారోగ్యానికి గురి అయినట్టు, భర్త పల్దె రాజు ఎన్ని ఆస్పత్రులు చూపించినా ఆరోగ్యంలో మార్పు రాలేదని, ఎప్పుడూ నేను చనిపోత అని అంటుండేదని పేర్కొన్నారు. జూన్ 28 మృతురాలి భర్త బయటకి వెళ్లి వచ్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉందని చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని, మృతురాలు భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
- Advertisement -



