Tuesday, June 30, 2026
E-PAPER
Homeబీజినెస్పాముకాటు భారాన్ని ఎదుర్కోవడానికి 4ఏ వ్యూహాన్ని అమలు చేస్తోన్న బీఎస్వీ

పాముకాటు భారాన్ని ఎదుర్కోవడానికి 4ఏ వ్యూహాన్ని అమలు చేస్తోన్న బీఎస్వీ

- Advertisement -

నవతెలంగాణ – మచిలీపట్నం: భారతదేశం వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభమైనది.  రుతుపవన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో పాముకాటు సంఘటనలు కూడా  ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్నాయి. ఈ సంఘటనలను తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ, ఒక కీలకమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ఇది నిలిచినది. మ్యాన్‌కైండ్ గ్రూప్ కంపెనీ మరియు రెండు దశాబ్దాలకు పైగా నాణ్యమైన పాముకాటు విరుగుడు (ఏఎస్వి) ఔషధంను అందిస్తూ  ఎక్కువమంది అభిమానించే సంస్థగా నిలిచిన బీఎస్వీ, దేశవ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర ‘4ఏ’ కార్యాచరణను అమలు చేయడం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఈ కార్యాచరణ, పాముకాటు కేసులలో నివారణ, సకాలంలో జోక్యం చేసుకోవటం మరియు వైద్య ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుని  అవగాహన (అవేర్నెస్) , లభ్యత (అవైలబిలిటీ) , అవకాశం (యాక్సెస్)  మరియు చర్య (యాక్షన్) అనే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెడుతుంది. దీర్ఘకాలంగా పాతుకుపోయిన  అపోహలను తొలగించడం,  నిరూపిత ఆధారిత పాముకాటు ప్రథమ చికిత్స , ఆ చికిత్సపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం కలిగించడం బీఎస్వీ యొక్క ప్రాధాన్యతగా నిలిచింది. సమీపంలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యానికి చేరుకోవటంను  నిర్ధారించడం , గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల అంతటా నాణ్యత హామీ గల ఏఎస్ వి ల లభ్యతను బలోపేతం చేయడం సమర్థవంతమైన నిర్వహణకు అత్యంత కీలకం. అన్నింటికన్నా ముఖ్యంగా, సరైన సమయంలో సరైన చికిత్స అందించడం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు మరియు న్యూరోటాక్సిసిటీ (పక్షవాతం), కోగ్యులోపతి, తీవ్రమైన మూత్రపిండాల గాయం, బహుళ అవయవాల పనితీరులో లోపం ,  మరణం వంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

 బిఎస్వి ఇండియా బిజినెస్ సిఓఓ  శివానీ శర్మ దేకా మాట్లాడుతూ, “పాముకాటు నివారణ మందుల రంగంలో మార్కెట్ లీడర్‌గా, పాముకాటు నిర్వహణ కోసం శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన, అధిక-నాణ్యత గల మరియు ప్రభావవంతమైన చికిత్సలను అందించడంలో బిఎస్వి ఎప్పుడూ ముందంజలోనే ఉంది. పాముకాటును తప్పనిసరిగా తెలియజేయాల్సిన వ్యాధిగా వర్గీకరించాలన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశం, డేటా విభజనను పరిష్కరించడం తో పాటుగా , ఏఎస్ వి పంపిణీని మెరుగు పరచడం మరియు పటిష్టమైన దేశవ్యాప్త నిఘా వ్యవస్థను నిర్మించడం వంటి అంశాలలో ఒక మైలురాయి వంటి ముందడుగు. అయితే, 2030 నాటికి పాముకాటు సంబంధిత మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యాన్ని సాధించడానికి క్షేత్రస్థాయిలో నిబంధనలను పటిష్టమైన రీతిలో  అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా సమాజంలో అవగాహనను పెంచడం, చిట్టచివరి వ్యక్తి వరకూ నిరంతరాయంగా చికిత్సను అందించడం, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ ప్రదాతల నైపుణ్యాలను మెరుగుపరచడం, సంరక్షణలో జాప్యాన్ని తొలగించడానికి సరైన ప్రథమ చికిత్స పరిజ్ఞానంతో సమాజాలను శక్తివంతం చేయడం వంటివి ఉన్నాయి. ఒక బాధ్యతాయుతమైన సంస్థగా,  మేము ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక చికిత్సా మార్గదర్శకాలకు (STGలు) కట్టుబడి ఉంటూనే సమాజంలో అవగాహన మెరుగు పరచటం మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు నిరంతర వైద్య శిక్షణను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాము”  అని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -