Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయంఅదానీ గ్రూప్‌పై అమెరికా కన్నెర్ర

అదానీ గ్రూప్‌పై అమెరికా కన్నెర్ర

- Advertisement -

ఆ సంస్థ సౌర దిగుమతులపై 126 శాతం టారిఫ్‌
అమెరికా వాణిజ్యశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ :
భారతదేశం నుంచి అదానీ గ్రూప్‌ సంస్థ ద్వారా దిగుమతి చేసుకుంటున్న సౌర ఉత్పత్తులపై అమెరికా 126 శాతం టారిఫ్‌ విధించింది. సబ్సిడీలపై జరుపుతున్న దర్యాప్తునకు అదానీ గ్రూపు కంపెనీలు ముంద్రా సోలార్‌ ఎనర్జీ, ముంద్రా సోలార్‌ పీవీ సంస్థలు సహకరించకపోవడంతో అమె రికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. భారత సోలార్‌ మాడ్యూల్‌ ఉత్పత్తి సామర్ధ్యం వేగంగా విస్తరిస్తున్న తరు ణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2024లో అమెరికాకు జరిగిన ఎగు మతుల విలువ దాదాపు రూ.6,578 కోట్లు (792.6 మిలి యన్‌ డాలర్లు). 2021-2024 మధ్య కాలంలో భారత్‌ నుంచి జరిగిన సోలార్‌ ఫొటో వాల్టాయిక్‌ మాడ్యూల్‌ ఎగుమతుల్లో 90 శాతానికి పైగా అమెరికాకే రవాణా అయ్యాయి.

కారణం ఇదే అదానీ గ్రూప్‌ కంపెనీలు
దర్యాప్తునకు సహకరించకపోవడంతో భారీగా టారిఫ్‌ విధిస్తున్నామని ఈ నెల 20న జారీ చేసిన ఆదేశాలలో అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది. దర్యాప్తులో అదానీ గ్రూప్‌ కంపెనీలను ‘తప్పనిసరి ప్రతివాదులు’గా చేర్చారు. అంటే కేసును పరిష్కరించాలంటే ఈ సంస్థలు విధిగా దర్యాప్తునకు హాజరు కావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో తీర్పు ఇవ్వడం కుదరదు. దర్యాప్తు ప్రక్రియ నుంచి ఈ సంస్థలు వైదొలిగితే కోర్టు ఆ కేసును రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. అదానీ గ్రూపు కంపెనీలు కేసు విచారణకు సహకరించకపోవడం తో అమెరికా వాణిజ్య శాఖ ‘అందుబాటులో ఉన్న ప్రతికూల వాస్తవాల’ (యాడ్‌ వర్స్‌ ఫ్యాక్ట్స్‌ అవైలబుల్‌) జరిమానాను విధించింది. తీవ్రమైన సందర్భాలలో మాత్రమే అమెరికా వాణిజ్య శాఖ ఈ వైఖరి తీసుకుంటుంది. గడువులోగా తాను కోరిన సమాచారాన్ని అందజేయడంలో అదానీ గ్రూప్‌ సంస్థలు విఫలమ య్యాయని, ప్రశ్నావళికి కూడా సమాధానాలు పంపలేదని వాణిజ్యశాఖ తెలిపింది.

పరిశ్రమలో మిశ్రమ స్పందన
అమెరికా నిర్ణయంపై పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అమెరికా నిర్ణయం కారణంగా భారత్‌ నుంచి జరుగుతున్న సౌర ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమె రికా విధించిన సుంకాలు దేశీయ ఉత్పత్తి దారులపై ధరల ఒత్తిడిని కలిగిస్తాయని ఐసీఆర్‌ఏ లిమిటెడ్‌ ఉపాధ్యక్షుడు అంకిత్‌ జైన్‌ తెలిపారు. సోలార్‌ మాడ్యూల్‌ ఉత్పత్తిదారుల లాభాలపై కూడా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. అయితే అమెరికాకు ఎగుమతులు ఇప్పటికే తగ్గిపోయినందున సుంకాల ప్రభావం పరిమితంగానే ఉంటుం దని కొంతమంది తయారీ దారులు తెలిపారు. గత సంవ త్సరం అమెరికాకు ఎగుమతులు యాభై శాతానికి పైగా పడిపోయా యని, ఇప్పుడు మన దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతులలో అమెరికా వాటా కేవలం 5-7 శాతం మధ్యే ఉన్నదని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ వినరు రస్తగీ అన్నారు.

ఆర్థిక ప్రయోజనాలు పొందిన అదానీ కంపెనీలు

ఎగుమతులతో ముడిపడిన, పన్ను రాయితీలు కల్పించిన ప్రోత్సాహక కార్యక్రమాల కింద భారతీయ సోలార్‌ సంస్థలు అక్కడి ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయా లేదా అనే విషయంపై అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది. ఈ కార్యక్రమాల కింద…దేశీయ తయారీదారులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేటప్పుడు వాటి తయారీ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై చెల్లించిన సుంకాలు, పన్నులను భారత ప్రభుత్వం తిరిగి వాపసు చేస్తోంది. లేదా మినహాయిస్తోంది. అడ్వాన్స్‌డ్‌ ఆథరైజేషన్‌ ప్రోగ్రామ్‌, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్‌ ఆథరైజేషన్‌ ప్రోగ్రామ్‌ స్కీమ్‌, డ్యూటీ డ్రాబ్యాక్‌ ప్రోగ్రామ్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ స్కీమ్‌ వంటి కార్యక్రమాలకు భారత్‌ ప్రోత్సాహకాలు అందజేస్తోంది. అదానీ గ్రూప్‌ కంపెనీలు తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో సోలార్‌ సెల్స్‌ను ఎగుమతి చేసి భారత ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు పొందాయని అమెరికా వాణిజ్య శాఖ నిర్ధారించింది. సౌర దిగుమతుల కోసం చైనాపై భారత్‌ ఎక్కువగా ఆధారపడుతోందని కూడా అది గుర్తించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -