పెండింగ్ బిల్లులు
రూ.745 కోట్లు విడుదల
అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు
పంచాయతీలకు రూ.389 కోట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లకు ప్రభు త్వం తీపి కబురు అందించింది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నది. అందులో భాగంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్చానల్లో నిధులను విడుదల చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది. ఫిబ్రవరికి సంబంధించిన బిల్లుల విడుదలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఆ నిధులను విడుదల చేశారు. ఉద్యోగులకు ప్రతినెల రూ.700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామంటూ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అ హామీ మేరకు గత జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తున్నది. విడుదలైన బిల్లులో గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.745 కోట్లు విడుదల చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి.
పంచాయతీలకు రూ.389 కోట్లు విడుదల్టి
గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ.389 కోట్లు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ఈ నిధులు దోహదపడతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.389 కోట్లు విడుదల చేయడం సర్పంచ్లు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు తీపికబురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



