- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ రాష్ట్ర సరిహద్దు ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయం ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో ఉన్నందున ప్రతి శని సోమ అమావాస్య పౌర్ణమి రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి దర్శించుకుంటారు.
- Advertisement -



