నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మంతపురి గ్రామం లో ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి దిశగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులను నాణ్యతతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దంతూరి స్వామి, పేరపు రాములు, కర్రే ఎల్లయ్య,వార్డు సభ్యులు పల్లె భవాని, పేరపు కృష్ణ, మక్కల రాములు, మధుసూదన్ రెడ్డి, కొడుకు సతీష్, రాములు, సంతోష్ రెడ్డి, ప్రతాపరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



