Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ తో సర్ పై సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

తహశీల్దార్ తో సర్ పై సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
నియోజకవర్గంలోని జుక్కల్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఇంటింటి గణన ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్లతో సమావేశమైన ఆయన, ఇంటింటి గణన జరుగుతున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ ల సందేహాలను నివృత్తి చేశారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి కక్షసాధింపు చర్యలకు తావివ్వకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సర్వే ప్రక్రియను నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పి తాసిల్దార్లతో వివరాలను అడిగి తెలుసుకుంటానని పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. 

అలాగే బీఎల్‌ఓలు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -