తెలుగు సినిమా సాంకేతికంగా రోజురోజుకూ మరింత విస్తృతం చేసుకుంటోంది. ఆ మార్పులో నిశ్శబ్దంగా తన ముద్ర వేస్తున్న ప్రతిభావంతులలో రాంజీ డాట్ ఒకరు. విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం సాంకేతిక అవసరంగానే కాకుండా, కథను మరింత ప్రభావవంతంగా చెప్పే సాధనంగా మలుస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీపై పట్టు, సృజనాత్మక ఆలోచన, కథపై అవగాహన—ఈ మూడు అంశాల సమన్వయమే రాంజీ డాట్ పనితీరుకు ప్రధాన బలం. అందుకే ఆయన రూపొందించే ప్రతి విజువల్ ప్రేక్షకుడిని కథలో మరింతగా లీనమయ్యేలా చేస్తుంది. ‘మహానటి, 118, మసూద, మిరాయ్’ వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ఒక్కో సినిమా ఒక్కో ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రతి ప్రాజెక్టులో కథకు తగ్గట్టుగా తన శైలిని మార్చుకుంటూ పనిచేయడం ఆయన ప్రత్యేకత. ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ప్రాజెక్ట్ ‘రావు బహదూర్’. దాదాపు రెండు గంటల నిడివి గల ఈ చిత్రంలో సుమారు అరగంటపాటు పూర్తిగా క్రియేటివ్ త్రీడీ వీఎఫ్‌ఎక్స్ ఆధారిత సన్నివేశాలు ఉంటాయి. ఇవి సాధారణ వీఎఫ్‌ఎక్స్ షాట్లు కావు. కాన్సెప్ట్ రూపకల్పన నుంచి తుది అమలు వరకు పూర్తిగా సృజనాత్మక దృష్టితో రూపొందించిన విజువల్ సీక్వెన్స్‌లు. వీటిని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు.
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



