సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘ఏముందో ఏమో’ పాటని రిలీజ్ చేశారు. ఈ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమ, ఎదురుచూపుల భావాలను ఎంతో అందంగా ఆవిష్కరించింది. హరి చరణ్ హృదయాన్ని తాకే వాయిస్‌తో పాడిన ఈ పాటకు జ్ఞాని మధురమైన ట్యూన్ అందించారు. అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన లిరిక్స్ ఈ సాంగ్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ, నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్, డీఓపీ : రమేష్ కుశేందర్ రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్, సంగీతం: గ్యాని, ఎడిటర్: వరప్రసాద్, ఆర్ట్: భూపతి యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్.
ఆహ్లాదకరమైన మెలోడీ ‘ఏముందో ఏమో..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



