Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమ్మె బాటకు సిద్ధ మౌతున్న ఆర్టిజన్ ఉద్యోగులు

సమ్మె బాటకు సిద్ధ మౌతున్న ఆర్టిజన్ ఉద్యోగులు

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ..
నవతెలంగాణ – చిన్న కోడూరు

విద్యుత్ శాఖలో ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికై సమ్మెబాటకు సిద్ధమవుతున్నట్లు టీవీ ఏఈ జెసి నాయకులు గౌటే భాస్కర్ తెలిపారు. ఆదివారం పెద్ద కోడూరు సబ్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 23, వేలమంది ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మె నిర్వాహన సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. విద్యుత్ శాఖలో నాలుగు గ్రేడ్లుగా విభజన జరిగిందన్నారు. 2017 లో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖలోని 23 వేల ఆర్టిజన్ కార్మికులను విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ వారి సర్వీసును క్రమబద్ధికరించారు.

క్రమబద్ధకరించిన కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించి సపరేట్ రూల్స్ ఇవ్వడం సంస్థలోవారికి వేతనాలు సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆర్టిజన్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా గత ఎనిమిది ఏళ్లుగా ప్రమోషన్ కల్పించలేదన్నారు. ఈ కార్మికులను గ్రేడ్ కూడా చేంజ్ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలని ఏపీ ఎస్ఈ బి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని కోరారు.ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలోపని చేస్తున్న పిసిరెట్ కార్మికులకు కనీస వేతనం చట్టం జీవో 11 ప్రకారం వేతనాలను చెల్లించాలని 30 రోజుల పని విధానాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్. శ్రీనివాస్ గౌడ్. తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -