నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. వీరిలో జైష్-ఎ-మహ్మద్, లష్కరే తోయిబాతో పాటు వాటి అనుబంధ సంస్థలకు చెందిన కీలక నేతలు ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉగ్రదాడులు, ఉగ్రవాదుల నియామకం, నిధుల సమీకరణ, ఆయుధాల అక్రమ రవాణా, సరిహద్దు చొరబాట్లు, ఉగ్ర సంస్థలకు సహకారం వంటి కార్యకలాపాల్లో వీరు పాల్గొంటున్నట్లు పేర్కొంది. ఈ 23 మందిలో 17 మంది పాకిస్థాన్ పౌరులు, ఆరుగురు భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కేంద్రం తెలిపింది.
‘ఉపా’ చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



