Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంటెలిగ్రామ్ కు కేంద్రం నోటీసులు

టెలిగ్రామ్ కు కేంద్రం నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ఘటనలతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా యాప్ లపై నజర్ పెంచింది. ఇటీవల వాట్సాప్ యూజర్ నెమ్ ఫీచర్ పై మెటా సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నూతన ప్యూచర్ ఆప్షన్ పై పలు అనుమానాలు ఉన్నాయని, వినియోగాదారుల భద్రతకు మెటా చేపట్టిన చర్యలు తెలియజేయాలని పేర్కొంది. తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) సంస్థకు నోటీసులు జారీ చేసింది. టెలిగ్రామ్’ (Telegram) ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ పైరసీ అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ పైరసీని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) టెలిగ్రామ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కాపీరైట్ ఉన్న ఇతర ప్రీమియం కంటెంట్ అనధికారికంగా లింకులు, ఫైళ్ల రూపంలో విస్తృతంగా షేర్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. పైరసీని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (Action Taken Report) సమర్పించాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -