నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తంలో గురువారం రాత్రి మహిళా హెడ్ కానిస్టేబుల్ తామరై సెల్విని ఆమె భర్త నడిరోడ్డుపై హత్య చేశాడు. తామరై సెల్వి డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి వెళుతుండగా భర్త అరవింద్ కత్తితో దాడి చేసి హతమార్చాడు. దాడి చేసిన వెంటనే తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం అరవింద్ అక్కడి నుండి పరార్ అయ్యాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అరవింద్ ఛాతిపై గాయాలు అవ్వడంతో పారిపోయి ఆస్పత్రిలో చేరాడు. అరవింద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండగా భార్య భర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అరవింద్ ను ఆస్పత్రిలోనే పోలీసులు విచారిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
దారుణం..మహిళా కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


