Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏపీ సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ఏపీ సంపర్క్‌ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రైలు S1 బోగీ కింది భాగంలో (బ్రేక్ షూ వద్ద) అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

చైన్‌లాగి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వెంటనే రైలు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానాలకు వెళ్లింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -